ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ దేశాన్ని అన్నిరంగాల్లో సంక్షోభంలోకి నెడుతూ అథోగతి పాలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలో జిల్లా కమిటీ సభ్యుడు బండారు రమేశ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, ధరలు, రైతులు, కార్మికుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా కేంద్రం వాటి పరి ష్కారంపై దృష్టి పెట్టకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు అనుగు ణంగా మోదీ వ్యవహరిస్తుండడం ఇక్కడి ప్రజలను కష్టాల్లోకి నెడుతోందని తెలిపారు. ఇకనైనా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, రాజ కీయ కక్షసాధింపు చర్యలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పి.సోమయ్య, బండి రమేశ్, వై.విక్రం, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, శ్రీనివాసరావు, మడుపల్లి గోపాల్‌రావు, మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


