ఖమ్మంలీగల్: బాల కార్మికులు లేని సమాజాన్ని తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని జిల్లా న్యా య సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస సూచించా రు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. బాలల స్నేహపూర్వక న్యాయ సేవల పథకాలు, బాల కార్మిక నిషేధ చట్టాలపై వివరించాక ఆమె మాట్లాడుతూ పిల్లలు పనికి కాకుండా పాఠశాలకు వెళ్లేలా సహకరించాలని సూచించారు. బాలలను పనుల్లో పెట్టడం చట్టరీత్యా నేరమని తెలిపారు. సమావేశంలో కార్మిక శాఖ అధికారి రమేశ్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ భారతి, పారా లీగల్ వలంటీర్లు, గ్రానైట్ ఫ్యాక్టరీల యాజమాన్యాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


