వైరారూరల్: రహదారిపై గుంతను తప్పించే క్రమాన ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని విప్పలమడకకు చెందిన తేళ్లూరు కళ్యాణ్ (23)దాచాపురంలో శుక్రవారం వాహనం ఇంజన్ ఆయిల్ మార్పించుకుని స్వగ్రామానికి వెళ్తున్నాడు. గరికపాడు సబ్‌స్టేషన్ సమీపాన రోడ్డుపై గుంతను తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ఆయనను బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.రామారావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి ..
ఖమ్మంక్రైం: ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మంలోని బైపాస్‌రోడ్డులోని మెడికల్ షాప్‌నకు బ్యాంక్‌కాలనీకి చెందిన చిండా జనకరాజు(69) గురువారం రాత్రి మందులు కొను గోలు చేసి వెళ్తున్నాడు. అదే సమయాన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వైపు పల్సర్‌పై వేగంగా వెళ్తున్న పాకబండ ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి ఎండీ జుబేర్ (20) జనకరాజును బలంగా ఢీకొట్టాడు. ఘటనలో ఇద్దరికి తీవ్రగా యాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జుబేర్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. అలాగే, జనకరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరా బాద్ తరలించారు. ఘటనపై జనకరాజు బంధువుల ఫిర్యా దుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.
ఉరి వేసుకుని ఆత్మహత్య
కూసుమంచి: మండలంలోని నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన షేక్ సుభానీ(45) ఈ నెల 9న తన ఇంట్లో ఉరి వేసుకోగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుభానీ మద్యానికి బానిస కాగా కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఆయన ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు ఆయన భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వడదెబ్బతో రైతు మృతి
టేకులపల్లి: మండలంలోని లచ్చతండాకు చెందిన జాటోత్ భీంజీ (45) శుక్రవారం ఉదయం తన చేనులోనే వడదెబ్బకు గురై అస్వస్థతతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని మరణంతో వారు శోకసంద్రంలో మునిగారు.
హైవేపై తప్పిన ప్రమాదం
వైరా: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై గురువారం అర్ధఽరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. కాకినా డ వెళ్తున్న ట్రావె ల్స్ బస్సు వైరా సోమవారం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా బస్సు ముందు భాగం బాగా దెబ్బ తిన్నది. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. వైరా ఎస్‌ఐ పి.రామారావు ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని వాహ నాలను పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.


