తిరుమాలయపాలెం: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభా వంతో తక్కువ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నందున, రైతులు నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య సూచించారు. మండలంలోని దమ్మాయిగూడెంలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ నెల సాధారణ వర్షపాతం, జూలైలో తక్కువగా, ఆగస్టులో లోటు నమోదై, సెప్టెంబర్‌లో అసలే వర్షాలు కురిసే పరిస్థితులు లేవని ఐఎండీ అంచనాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈమేరకు నీటి వనరులు ఉంటేనే వరి సాగు చేయాలని, పత్తికి బదులు నూనె గింజలు, పెసర, కంది, నువ్వులు, జొన్న సజ్జలు సాగు చేయడం మంచిదని తెలిపారు. కాగా, యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఏఈఓ లు, మీ సేవ కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే ఆ సమాచారం అధికారులకు తెలియచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి ఏడీఏ సతీష్, ఏఓ నారెడ్డి సీతారాంరెడ్డి, ఏఈఓ ఎండీ.ఆసియా, సర్పంచ్ వినోద పాల్గొన్నారు.
రూ.47 లక్షలకు
ఐపీ దాఖలు
ఖమ్మంలీగల్: ఖమ్మం దానవాయిగూడెంనకు చెందిన చిలకమర్రి మౌనిక, చిలకమర్రి సురేశ్ రూ. 47.84 లక్షలకు గాను దివాలా పిటీషన్ (ఐపీ) దాఖ లు చేశారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా వారు ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం పిటీషన్ దాఖలు చేశారు. ప్రైవేట్ చిట్ ఫండ్స్‌తో ఫైనాన్స్ వ్యాపారం నడిపించిన తాము చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ 17 మందిని ప్రతివాదులుగా చేర్చారు.


