ఖమ్మంసహకారనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యాన ప్రభుత్వం వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హెల్త్‌కార్డుల విధివిధానాలు రూపొందించి వెంటనే ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన వేలాది మంది ఉద్యో గ, ఉపాధ్యాయులకు బెనిఫిట్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అంతేకాక సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ, హెల్త్ కార్డులపై నగ దు రహిత వైద్యం, ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల రూపకల్పన, సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సమా వేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, రాందాస్, నర్సయ్య, నాగేశ్వరరావు, నిర్మలకుమారి, రామకృష్ణ, ఉద్దందు, పద్మ పాల్గొన్నారు.


