గేదెలు ఢీకొని గార్డుకు తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

గేదెలు ఢీకొని గార్డుకు తీవ్రగాయాలు

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

నేలకొండపల్లి: విధినిర్వహణలో భాగంగా చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని వెంబడించే క్రమాన గేదెలు ఢీకొనడంతో వ్యవసాయ మార్కెట్‌ సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేలకొండపల్లి మార్కెట్‌ పరిధిలోని పైనంపల్లి చెక్‌పోస్టులో మారగాని వీరబాబు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల రాత్రి వేళ ఓ వాహనాన్ని ఆపినా ఆగకపోవడంతో బైక్‌పై వెంబడిస్తుండగా గేదెలు తగిలి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఆరా తీయకపోగా, ఖమ్మంలో చికిత్స పొందుతున్న తనను అధికారులు కనీసం పరామర్శించలేదని వాపోతున్నాడు. అంతేకాక చెక్‌పోస్టు నిర్మాణం కోసం వెచ్చించిన రూ.1.50 లక్షలు కూడా ఇవ్వడం లేదని వెల్లడించాడు. చెక్‌పోస్టు నుంచి లక్ష్యాన్ని మించి రూ.56 లక్షల ఆదాయం సమకూర్చిన తనను ఇకనైనా ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై మార్కెట్‌ అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement