సెప్టెంబర్‌లో ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభలు | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభలు

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) నాలుగో జాతీయ మహాసభలను ఖమ్మం వేదికగా నిర్వహించనున్నట్లు జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. సెప్టెంబర్‌ 28, 29, 30వ తేదీల్లో జరిగే సభల పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఆహ్వాన సంఘం సమావేశానికి వి.కోటేశ్వరరావు అధ్యక్షత వమించగా వెంకట్రామయ్యతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డాక్టర్‌ ఎం.ఎఫ్‌ గోపీనాథ్‌, రవిమారుత్‌, కొల్లి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపద, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలులో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభలను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాసభల ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మండల వెంకన్న, పీఓడబ్ల్యూ, టీపీటీఎఫ్‌తో పాటు న్యూడెమోక్రసీ నాయకులు ఎన్‌.తిరుమలరావు, ఝాన్సీ, తాళ్లూరి వేణు, పి.రామకోటేశ్వరరావు, శేషగిరిరావు, సీహెచ్‌.బాబురావు, ఆవునూరి మధు, బండారు ఐలయ్య, గౌని ఐలయ్య, ముక్తి సత్యం, జడ సీతారామయ్య, కోలా లక్ష్మీనారాయణ, బజ్జూరి వెంకట్రామిరెడ్డి, వై.ప్రకాష్‌, పి.విప్లవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement