ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు పెంచాలి

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

బోనకల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అందుతున్న నాణ్యమైన బోధన, అందుబాటులో వసతులను వివరిస్తూ విద్యార్థులు చేరేలా అవగాహన కల్పించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి కె.రవిబాబు సూచించారు. బోనకల్‌ కాలేజీని గురువారం తనిఖీ చేసిన ఆయన భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ ప్రతీగ్రామంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కలిసి కాలేజీలో చేరాలని చూడాలన్నారు. ఈక్రమాన ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతుందనే అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కాలేజీలో చేరిన విద్యార్థులకు ఆయన పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ నళినిశ్రీ, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement