ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణకు ప్రతిపాదించిన 17.51హెక్టార్ల అటవీ భూమి మళ్లింపు ప్రాంతాన్ని బుధవారం పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రాంతీయ కార్యాలయం అధికారి ఎస్.యువరాజ్ పరిశీలించారు. భూమి విస్తీర్ణం, ప్రాజెక్ట్ అవసరాలు, ప్రభావిత ప్రాంత వివరాలు, కుటుంబాల సంఖ్య తదితర వివరాలను ఇల్లెందు జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. జేకే ఓసీ భవిష్యత్ అభివృద్ధి, ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అటవీ భూమి మళ్లింపు, అనుమతుల ప్రక్రియపై అధికారులతో చర్చించారు. డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్, ఎఫ్‌డీఓ కరుణాకర్, ఎస్‌ఓటూ జీఎం బలరాం పాల్గొన్నారు.


