ఆలయ భూముల కౌలుకు రేపు వేలం | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల కౌలుకు రేపు వేలం

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

పెనుబల్లి: మండలంలోని శ్రీనీలాద్రీశ్వర స్వామి ఆలయానికి చెందిన ఎకరం భూమి అన్నపురెడ్డిపల్లి మండలం నామవరంలో ఉండగా, కౌలుకు ఇచ్చేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురంలోని శ్రీ కోదండ రామాలయంలో వేలం పాట ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు రూ.5 వేలు డిపాజిట్‌ చెల్లించి పాల్గొనాలని సూచించారు. అలాగే, ఈ నెల 13వ తేదీన మాస శివరాత్రి, శని త్రయోదశి సందర్భంగా నీలాద్రీశ్వర స్వామి దేవస్థానంలో శనీశ్వర స్వామికి జరిగే తైలాభిషేకంలో భక్తులు పాల్గొనవచ్చని ఈఓ వెల్లడించారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

ముదిగొండ: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిగొండలో బుధవారం జరిగిన జిల్లా మహాసభలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా మెరుగు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర శ్రీనివాస్‌తో పాటు 45 మందితో జిల్లా కమిటీ ఎన్నికై ంది. ఈ సమావేశంలో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శులు భట్టు పురుషోత్తం, వేల్పుల భద్రయ్య, నాయకులు టీఎస్‌ కల్యాణ్‌, వెంకన్న, దామోదర్‌, సర్పంచ్‌ కట్టకూరి ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతాపం చూపిన భానుడు

ఖమ్మంవ్యవసాయం: వర్షాకాలం ప్రారంభమైనా సూర్యప్రతాపం తగ్గడం లేదు. గత సోమవారమే మృగశిర కార్తె ప్రవేశించగా, రెండు రోజులు దాటినా ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించడం లేదు. వర్షం కురిసిన రోజే స్వల్పంగా ఉష్ణోగ్రత తగ్గుతూ, మళ్లీ భానుడు జూలు విదులుస్తున్నాడు. ఈ క్రమాన బుధవారం జిల్లాలో 41.1 – 42.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పగటి వేళ వేడి, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అత్యధికంగా ముదిగొండలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పల్లెగూడెం, కుర్నవల్లిలో 42.7, గేటు కారేపల్లి, కొణిజర్ల, గుబ్బగుర్తిలో 42.6, కల్లూరు, బాణాపురంలో 42.5, గౌరారం, ప్రకాష్‌నగర్‌, చింతకాని, ఎర్రుపాలెంలో 42.4, పమ్మి, ఏన్కూరులలో 42.3, ఖానాపురం, పెనుబల్లి, పెద్దగోపతి, వైరా, మధిర, సత్తుపల్లిలో 42.2, తల్లాడ, రఘునాథపాలెం, వైరాలలో 42.1, లింగాల, నేలకొండపల్లి, కాకరవాయి, రావినూతలలో 42 మేర ఉష్ణోగ్రత నమోదైంది.

కుంగిపోయిన రహదారి

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 24వ వార్డు సమీపాన ఖమ్మం – కురవి రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగానే ఓ చోట కుంగిపోయింది. ఇలా జరగడానికి అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, కుంగిపోయిన చోట గుంత కానరాకుండా మట్టి పోయడం గమనార్హం.

విద్యుత్‌ ఉద్యోగినుల ప్రతిభ

ఖమ్మంవ్యవసాయం: టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యాన ‘విశ్వేశ్వరయ్య లెక్చర్‌ సిరీస్‌–03’కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో ఖమ్మం సర్కిల్‌ విద్యుత్‌ ఉద్యోగినులు ప్రతిభ కనబరిచారు. పే రోల్స్‌ విభాగంలో ఎన్‌.స్వాతి, ఎస్‌ఏపీ పర్చేస్‌ ఆర్డర్‌ క్రియేషన్‌ విభాగంలో కె.నవ్యశ్రీ ప్రతిభ చాటి ప్రశంసాపత్రాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి బుధవారం అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement