నకిలీ విత్తనాలు అంటగడితే కఠినచర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు అంటగడితే కఠినచర్యలు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

తిరుమలాయపాలెం: రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలు అమ్మి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు విత్తన షాపులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీలర్ల స్టాక్‌ రిజిస్టర్లు, లైసెన్స్‌లను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. ఎప్పటికప్పుడు స్టాక్‌ వివరాలు నమోదు చేయడమే కాక రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు కూడా లైసెన్స్‌ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా విత్తనాలు అమ్మేందుకు వస్తే ఆ సమాచారాన్ని పోలీస్‌, వ్యవసాయాధికారులకు ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఏలువారిగూడెం గ్రామసభలో డీఏఓ పుల్లయ్య మాట్లాడారు. ఏడీఏ మిట్టపల్లి సతీశ్‌, ఏఓ నారెడ్డి సీతారాంరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.

డీఎఓ ధనసరి పుల్లయ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement