మద్యం తాగి వాహనాలు నడపొద్దు | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

ఏన్కూరు: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దని కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్‌ సూచించారు. మండలంలోని నూకలంపాడులో బుధవారం జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగవని తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ఽ, కార్లలో వెళ్లే వారు సీట్‌బెల్ట్‌ వినియోగించాలని సూచించారు. అనంతరం ఏన్కూరు పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ కేసుల నమోదు, విచారణపై సమీక్షించడంతో పాటు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పెనుబల్లి సీఐ ముత్తిలింగం, ఎస్‌ఐ నారబోయిన సంధ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement