రైతులకు అండగా ‘సాక్షి’ | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా ‘సాక్షి’

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

నేడు డీఏఓతో ఫోన్‌ ఇన్‌

ఖమ్మంవ్యవసాయం: నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు మొదలయ్యాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే, దుక్కులు దున్నడంలో జాగ్రత్తలు, మేలైన విత్తనాల ఎంపిక, నకిలీల బారిన పడకుండా కాపాడుకోవడం, ఎంచుకోవా ల్సిన ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై అవగాహన కోసం రైతులకు ‘సాక్షి’ అండగా నిలవనుంది. రైతులు తమ సందేహాలపై నేరుగా జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్యతో మాట్లాడేలా ‘ఫోన్‌ ఇన్‌’ నిర్వహిస్తోంది. ఈమేరకు అన్నదాతలు నిర్ణీత సమయంలో ఫోన్‌ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 09–06–2026, మంగళవారం (నేడు) సమయం : ఉదయం 8నుంచి

9 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌

89777 47500

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement