కామేపల్లి: రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటే కేంద్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పంటలకు మద్దతు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొత్తలింగాల క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో సంఘం జిల్లా శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమ్యాయి. ఈసమావేశంలో వారు మాట్లాడూ కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందంతో దేశ రైతులను దెబ్బ తీసేలా ఉందని ఆరోపించారు. పత్తి, వరి పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలంటే వాటికి కనీస మద్దతు ధర, బోనస్ ప్రకటించాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు మద్దినేని రమేష్‌బాబు, నల్లమోతు లక్ష్మయ్య, ఇంజం నాగభూషణం, అంబటి శ్రీనివాస్, బొంతు రాంబాబు, శీలం ఫకీరయ్య, వాసిరెడ్డి ప్రసాద్, ఎస్.కే.మీరా, గొడవర్తి నాగేశ్వరరావు, బిక్కసాని గంగాధర్, దీవెల వీరయ్య, బాదావత్ శ్రీనివాస్, రాయల సత్యనారాయణ, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.


