ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

కూసుమంచి: వాతావరణ పరిస్థితుల దృష్టాయ రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి సేంద్రియ వ్యవసాయ విధానం అనుసరించాలని ఖమ్మం కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన రైతులు సంప్రదాయ పంటలకు బదులు లాభదాయక పంటలను సాగు చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. కాగా, వర్షాలు మొదలైనందున పారిశుద్ధ్య లోపం ఎదురుకాకుండా చూడాలని, తద్వారా సీజనల్‌ వ్యాధులు దరిచేరవని చెప్పారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై అపోహలు విడనాడి ఉద్యోగులకు సహకరించాలని సూచించారు. ఆర్‌డీఓ శ్రీనివాస్‌, మండల ప్రత్యేకాధికారి సునీల్‌రెడ్డి, ఎంపీడీఓ జశ్వంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement