ఎల్‌నినో.. ఏం చేద్దాం?! | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో.. ఏం చేద్దాం?!

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

ప్రత్యామ్నాయ పంటలే మేలు 8 లో

మెట్టపంటలైనా సాగయ్యేనా?

వర్షపాతం తగ్గుతుందని

ప్రభుత్వ ప్రకటన

అందుకు తగినట్టే రుతుపవనాల రాక ఆలస్యం

భూముల్లో తేమ లేక పొడి దుక్కులు ప్రారంభించిన రైతులు

వర్షాల కోసం ఎదురుచూస్తున్నా..

–జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య

గత ఏడాది పుష్కలం

గత ఏడాది అన్నీ కలిపి 6.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తే రైతులు 6.17 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. 2025 జూన్‌ నుంచి ఈ ఏడాది మే చివరి వరకు జిల్లాలో సగటున 10.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఏడు మండలాలు మినహా 14మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మే చివరి వారం నుంచే వర్షాలు ప్రారంభమైతే, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈనెల 1నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో సగటున 2.5 సెం.మీ. వర్షపాతమే నమోదైంది.

ఆగమనమే ఆలస్యం

ఇప్పటికే జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, రాష్ట్రంలోకి రావడానికే మరో మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్‌ మొదటి వారం దాటుతున్నా సరైన వర్షం పడలేదు. గత ఏడాది జూన్‌లో జిల్లాలో సగటున 12.3 సెం.మీ., జూలైలో 28.1 సెం.మీ., ఆగస్టులో 38.9 సెం.మీ., సెప్టెంబర్‌లో 24.0, అక్టోబర్‌లో 19.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కానీ ఈ వేసవిలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదు కావడంతో భూమిలో తేమ శాతం తగ్గి, ఇప్పటికీ 40 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అదునులో రాకపోతే..

నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు సమృద్ధిగా కురవాల్సి ఉన్నా ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు దిశ మార్చుకుంటాయనే ఆందోళన రైతాంగాన్ని వేధిస్తోంది. ఫసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని శాస్త్రవేత్తలు ఎల్‌నినోగా పేర్కొంటున్నారు. దీనివల్ల గాలివీచే దిశలు మారి, రుతు పవనాలు దారితప్పుతాయని చెబుతున్నారు. తద్వారా ప్రస్తుతం రుతుపవనాలు వచ్చినా.. ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో ఎల్‌నినో ప్రభావం పడుతుందని తెలుస్తోంది. పంటల సాగుకు సరైన సమయం అదే కావడంతో వరి తదితర పంటలు పొట్ట దశకు చేరుకునేటప్పుడు నీరు అవసరం ఉంటుంది. ఆ సమయంలో వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న రైతులను వేధిస్తోంది. అయితే ఒకటి, రెండు తుపాన్లు వస్తే ఎల్‌నినో పెద్దగా ప్రభావం చూపదనే ధైర్యంతో ఇంకొందరు ఉన్నారు.

ఈ సమయానికే మెట్ట పంటలకు సంబంధించి దుక్కులు దున్నడం మొదలుకావాలి. కానీ సరైన వర్షాలు లేక రైతులు ముందుకు రావడం లేదు. వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ ఈసారి ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలని ప్రచారం చేస్తోంది. ఇటీవల వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్షలోనూ ఇదే సూచన చేశారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ(ఇండియన్‌ మెటీరియాలజికల్‌ డిపార్ట్‌మెంట్‌) ప్రకటన నేపథ్యాన అధికారులు అలసంద, కంది, పెసర తదితర పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ పంటలైనా సాగవుతాయా అన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై ఎల్‌నినో ప్రభావం పడుతుందనే సూచనలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మరింత సమయం పట్టడమే కాక ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా మెట్ట పంటల సాగు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది ఈ సమయానికే రుతుపవనాల ఆగమనంతో రైతులు దుక్కులు దున్ని ముమ్మరంగా పంటల సాగుకు కదిలారు. కానీ ఈసారి అధిక వేడితో భూమిలో తేమ తగ్గిపోగా ఇప్పుడిప్పుడే పొడి దుక్కులు ప్రారంభిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

వానాకాలం సాగుపై

రైతుల్లో సందిగ్ధత

గత ఏడాది ఈ సమయానికి వర్షాలు పడడంతో దుక్కులు సిద్ధం చేసి పత్తి విత్తనాలు పెట్టాం. ఈ ఏడాది ఇప్పటికీ వర్షం పడలేదు. దుక్కులు ఇంకా సిద్ధం కాలేదు. గత ఏడాది కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాల్లో పత్తి, ఎకరంలో మిర్చి పంట సాగు చేశా. ఈ ఏడాది కూడా పత్తి, మిర్చి సాగు చేసేందుకు విత్తనాలు సిద్ధం చేశాను. వర్షాలు వస్తే దుక్కులు దున్నుతాం. – తురక రాంబాబు,

ఎదుళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement