ఖమ్మంవ్యవసాయం: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అప్పుడప్పుడూ వర్షం కురుస్తున్నా భానుడు మాత్రం తన ప్రతాపాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. రోహిణి కార్తె ముగిసి సోమవారం మృగశిర కార్తె మొదలు కానుండడంతో వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కానీ జూన్ మొదటి వారం పూర్తి కావొస్తున్నా మే నెల మాదిరిగానే ఎండల తీవ్రత కొనసాగుతుండడం గమనార్హం. జిల్లాలో ఆదివారం 40.6 నుంచి 42.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం ఖానాపురం, మధిర మండలం సిరిపురంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మధిర, చింతకాని, కొణిజర్ల, ప్రకాష్‌నగర్‌లో 42.7, కల్లూరు, పమ్మిలో 42.5, కాకరవాయిలో 42.4, నేలకొండపల్లి, బచ్చోడు, నాగులవంచ, కుర్నవల్లిలో 42.3, సత్తుపల్లి ఓసీ, మధిర ఏఆర్‌ఎస్, బాణాపురం, తిమ్మారావుపేటలో 42.2, ఎర్రుపాలెం, సత్తుపల్లి, గుబ్బగుర్తి, గంగారం, లింగాల, పల్లెగూడెం, పెనుబల్లి, గేటు కారేపల్లిలో 42.1, గౌరారంలో 42, ఏన్కూరు, ఖమ్మం ఎన్నెస్పీ, తిరుమలాయపాలెంలో 41.9, రఘునాథపాలెంలో 41.8, పంగిడి, పెద్దగోపతి, ముదిగొండలో 41.7, వైరా ఏఆర్‌ఎస్‌లో 41.6, రావినూతల, మంచుకొండలో 41.5, వైరా, తల్లాడ, కూసుమంచిలో 41.4, వేంసూరులో 41, సదాశివునిపాలెంలో 40.7, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
జిల్లాలో 40.6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత


