జీవితం సాగలేక.. | - | Sakshi
Sakshi News home page

జీవితం సాగలేక..

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

● జీపీల్లో మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాలు రాక మూడు నెలలు ● మరోపక్క పనిభారంతో సతమతం

ఈ నెల 15లోగా ఇచ్చేలా చర్యలు

వేతనాలు అందక విలవిల
● జీపీల్లో మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాలు రాక మూడు నెలలు ● మరోపక్క పనిభారంతో సతమతం

ఎర్రుపాలెం: రెక్కాడితే కానీ డొక్కాడని పేదలైన పలువురికి గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్‌ వర్కర్లుగా అవకాశం దక్కగానే సంతోషించారు. ఎంతో కొంత వేతనమైనా ప్రతీనెలా వస్తుందని, తద్వారా కుటుంబ పోషణకు ఇక్కట్లు తీరుతాయని భావించారు. కానీ ప్రతీసారి నెలల తరబడి పెండింగ్‌ పెడుతుండడం.. కొన్నిసార్లు మూడు, నాలుగు నెలలకోసారి కూడా వేతనాలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఇచ్చేదే తక్కువ

గ్రామపంచాయతీల్లో మల్టీ పర్పస్‌ వర్కర్లకు నిర్దిష్టమైన పని అంటూ ఉండదు. పంచాయతీ పరిధిలో అన్ని రకాల పనులు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పరిస్థితి నుంచి మినహాయింపు కావాలని వర్కర్లు కోరుతున్నా అది నెరవేరడం లేదు. ఇక నెలకు రూ.9,500 వేతనమే ఇస్తున్నా అది కూడా క్రమం తప్పక చెల్లించడం లేదు. ప్రసుత్తం మల్టీపర్పస్‌ వర్కర్లకు మూడు నెలల వేతనం పెండింగ్‌ ఉంది. మరోపక్క జూన్‌ కూడా రావడంతో ఈ నెల కలిపితే నాలుగు నెలల వేతనం చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలనెలా వేతనాలు ఇస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం కనీస జీతంతో కష్టంగా బతుకు వెళ్లదీస్తున్న తమను పట్టించుకోకపోవడం సరికాదని కార్మికులు వాపోతున్నారు. వేతనాల విషయం బయట తెలిసి కనీసం అప్పు కూడా పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలుగా మల్టీపర్పస్‌ వర్కర్ల వేతనాలు పెండింగ్‌ ఉన్నమాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. ఈ నెల 15వ తేదీలోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.

–త్యాగరాజు కృష్ణ, ఎంపీఓ, ఎర్రుపాలెం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement