ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో శనివారం రోజంతా ఎండ ఉండగా.. సాయంత్రం తర్వాత ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. నైరుతి రుతుపవనాల ఆలస్యంతో మే నెల మాదిరిగానే ప్రస్తుతం కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా శనివారం 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ముదిగొండలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, లింగాల, రఘునాథపాలెం, గౌరారంలో 42.7, ఖానాపురం, మధిరలో 42.6, పెనుబల్లి, కాకరవాయి, కొణిజర్ల, ఖమ్మం ప్రకాష్‌నగర్, ఎర్రుపాలెంలో 42.5, మధిర, మంచుకొండ, గేటు కారేపల్లి, పమ్మిలో 42.4, సిరిపురం, బచ్చోడు, పల్లెగూడెం, కల్లూరులో 42.3, తిమ్మారావుపేట, గుబ్బగుర్తిలో 42.2, బాణాపురంలో 42.1 ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే, రాత్రి 7 గంటల తర్వాత కొన్నిప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు కురిశాయి.


