సత్తుపల్లిటౌన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి అటవీ రేంజ్ ఉద్యోగులు వాకర్లు, సందర్శకులు నీలాద్రి అర్బన్ పార్కులో శనివారం ‘బర్డ్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా పక్షులను పరిశీలిస్తూ వాటి ప్రత్యేకతలపై వన్యప్రాణి నిపుణుడు దీపక్ రామాయణ్ అవగాహన కల్పించారు. ఈక్రమాన 27 రకాల పక్షి జాతులు పార్క్‌లో ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గుర్తించారు. సత్తుపల్లిలో ఈ పార్కు జీవవైవిధ్యానికి చిరునామాగా నిలుస్తోందని ఈ సందర్భంగా రేంజర్ ఎల్లయ్య, ఉద్యోగులు తెలిపారు.


