నవ్వుల పంట | - | Sakshi
Sakshi News home page

నవ్వుల పంట

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

బాల గేయం

నవ్వుల పంట పండిద్దాం

నలుగురికి నవ్వులు పంచుదాం

అందరినీ సమంగా చూద్దాం

ఆప్యాయంగా పలకరిస్తూ

అందరికీ ప్రేమను అందిద్దాం

మమతను పంచి మాట్లాడితే

మల్లెలే పరిమళించునులే

సమతతో నడిచిన చోట

సంతోషమే నిండిపోవునులే

చిన్నాపెద్ద భేదం లేక

చిరునవ్వుతో కలిసి పోదాం

పగలు, పంతాలు వీడుదాం

మంచితనాన్ని నింపుదాం

–అశ్వారావుపేటరూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement