నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

ఎస్‌ఐఆర్‌ పారదర్శకంగా నిర్వహించాలి

ఖమ్మంసహకారనగర్‌: మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్‌ పకడ్బందీగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దివాకర్‌ టీ.ఎస్‌. సూచించారు. నీట్‌ నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నీట్‌ నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలలు తెరిచే సమయం సమీపిస్తున్నందున వసతులపై దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీఈఓ చైతన్యజైనీ, డీఎంహెచ్‌ఓ రామారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

●కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్‌ దివాకర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు రాజు, అన్సారీ, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

●ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సౌకర్యాల కల్పన విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ దివాకర తెలిపారు. టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా ఆయన సూచనలు చేశారు. టీఎన్జీవోస్‌ జిల్లా కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్‌, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటపాటి రుక్మారావు, ఎన్‌.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 25 నుంచి ఇంటింటి సర్వే

ఖమ్మంసహకారనగర్‌: అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్‌ జరిగిన సమీక్షలో అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 2002 నాటి జాబితా, ప్రస్తుత జాబితా ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయినందున ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం సెర్ప్‌, మెప్మా సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలకు 11వ తేదీన శిక్షణ ఇస్తామని, జాబితాలో పనితీరు సరిగ్గా లేని వారిని త్వరగా గుర్తించాలన్నారు. కాగా, మ్యాపింగ్‌లో గుర్తించిన లోపాల ఆధారంగా ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. ఆపై ఇంటింటి సర్వేలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాలు స్వీకరించాలని సూచించారు. సమావేశంలో కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఆర్డీఓ శ్రీనివాస్‌, ఉద్యోగులు రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

మఽధిర: ఓటరు జాబితాలో అర్హుల పేర్లే ఉండేలా ఎస్‌ఐఆర్‌ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ సూచించారు. మధిర మండలం జాలిముడిలో ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ను అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పలువురు ఓటర్ల ఇంటికి వెళ్లి సమస్యలు ఆరా తీయడమే కాక ఉద్యోగులకు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో కచ్చితమైన ధ్రువీకరణ, డేటా నమోదును పారదర్శకతతో పనిచేయాలన్నారు. ఆర్డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement