ఖమ్మంగాంధీచౌక్: దేశ ఆర్థికాభివృద్ధిలో పన్నుల ఆదాయం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ తల్లాపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్(ఏఐఎఫ్‌టీపీ), జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(కేజీపీఏ) సంయుక్త ఆధ్వర్యాన ఖమ్మంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాపారులు – ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరించే ప్రాక్టీషనర్లు పన్ను చట్టాల్లో మార్పులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఏఐఎఫ్‌టీపీ సెక్రటరీ జనరల్ జి.భాస్కర్, సౌత్ జోన్ చైర్మన్ డీఎం భట్టాడ్, కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం, జాతీయ ఉపాధ్యక్షుడు సి.సంజీవరావు మాట్లాడగా.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వుల్లిబోయిన సైదులు అధ్యక్షతన జరిగిన సదస్సుకు బి.దుర్గాప్రసాద్‌రావు చైర్మన్‌గా వ్యవహరించగా, కేజీపీఏ కార్యదర్శి పవన్‌కుమార్‌తో పాటు రమేశ్, శ్రీనివాసులు, శ్రీధర్‌రెడ్డి, వాసు, ఈశ్వరయ్య, ఉపేందర్, సురేశ్, రామకృష్ణ, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండలో డిజిటల్ మోడల్ లైబ్రరీ!
ఖమ్మంగాంధీచౌక్: ముదిగొండలో డిజిటల్ మోడల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ప్రస్తుత లైబ్రరీ ఇరుకుగా ఉండగా, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు కోసం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్‌బాబా శనివారం ఖమ్మం ఆర్‌డీఓ శ్రీనివాస్‌ను కలిసి స్థల కేటాయింపుపై చర్చించారు. ఆయన ముదిగొండ తహసీల్దార్‌తో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన స్థల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ శ్రీనివాస్


