విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

వైరారూరల్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వృద్ధిలోకి రావడమే కాక సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌ సూచించారు. ప్రవాస భారతీయుడు కొండబోలు సురేష్‌, ఆయన సోదరి లలిత సహకారంతో వైరా మండలంలోని ప్రభుత్వ హైస్కూళ్లు, కళాశాలల్లో ఎస్సెస్సీ, ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయస్థానం సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు, రూ.7,500 చొప్పున 38 మందికి రూ.3,37,500 నగదు ప్రోత్సాహకాలను శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్‌ మాట్లాడుతూ.. సురేశ్‌, లలిత విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, దాతల చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 90 శాతం హాజరు ఉన్న ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి అందిన ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్‌ ముళ్లపాటి విజయలక్ష్మి, మార్కెట్‌ చైర్మన్‌ బోళ్ల గంగారావు, నాయకులు డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, బెజవాడ వీరభద్రం, శీలం వెంకటనర్సిరెడ్డి, పొదిలి హరినాథ్‌, మచ్చా వెంకటేశ్వరరావు, గూడపాటి సూర్యప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఐ చేయూతతో అందించిన

ఎమ్మెల్యే రాందాస్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement