హాస్టళ్లలో వసతులు మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో వసతులు మెరుగుపర్చాలి

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యాన ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో వసతులను మెరుగుపరచాలని ఎస్సీ, బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి సూచించారు. వసతి గృహాల్లో సౌకర్యాల కల్పన, ప్రవేశాలపై ఆమె శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రవేశాలు పెరిగేలా అధికారులు గ్రామాల్లో పర్యటించాలని తెలిపారు. అలాగే, వసతి గృహాల మరమ్మతు పనులను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా భవనాలు శిథిలావస్థ లో ఉంటే వారిని ప్రైవేట్‌ భవనాల్లోకి మార్చాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాక వసతి గృహాల్లో మెనూ చార్టులు ప్రదర్శించి, 9వ తేదీన సంపూర్ణ శానిటేషన్‌ చేపట్టాలని సూచించారు. ఆయా శాఖల అసిస్టెంట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement