వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

పురోగతిలో రోడ్లు, డ్రెయినేజీ పనులు

గరిష్టం / కనిష్టం

400 / 280

జిల్లాలో శనివారం ఉదయం ఎండ ప్రభావం తక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నానికి పెరిగినా సాయంత్రం మళ్లీ చల్లబడుతుంది.

వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని డ్రెయినేజీ సమస్య వేధిస్తోంది. చిన్న వర్షం కురిసినా డ్రెయినేజీల్లో నీరు సాఫీగా సాగక రోడ్లపైకి చేరుతోంది. దీన్ని అధిగమించేలా నగరంలోని 60 డివిజన్లలో రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(యూఐడీఎఫ్‌) కింద 37 పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఐటీ హబ్‌ నుంచి సీఆర్‌జీ టవర్స్‌ వద్ద కల్వర్ట్‌ వరకు రూ.1.66 కోట్లతో ఫుట్‌పాత్‌ నిర్మాణం, ఎఫ్‌సీఐ గోడౌన్‌ నుంచి బైపాస్‌ రోడ్డు వరకు రూ.1.15 కోట్లతో సీసీ డ్రెయిన్‌ నిర్మాణం తదితర పనులు మొదలుకాగా, ఇంకొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. మరోపక్క ప్రత్యేక గ్రాంట్ల కింద నగరాభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.15కోట్లు కేటాయించింది. ఈ నిధులతో చేపట్టే పనులన్నీ వర్షాలు జోరందుకునేలా పూర్తి చేయాలని పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తాజాగా జరిగిన సమీక్షలోనూ మంత్రి ఇదే సూచన చేసిన నేపథ్యాన.. వర్షాలు ముంచెత్తినా పనులు పూర్తికాకపోతే ప్రజలకు గత ఇబ్బందులే పునరావృతం కానున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement