‘గల్లీ’ల నిండా ప్రమాదాలు..! | - | Sakshi
Sakshi News home page

‘గల్లీ’ల నిండా ప్రమాదాలు..!

Jun 5 2026 12:42 AM | Updated on Jun 5 2026 12:42 AM

● ఖమ్మంలో సెట్‌బ్యాక్‌ లేకుండానే నిర్మాణాలు ● ఇరుకు సందుల్లో అంతస్తులపై అంతస్తులు ● అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్‌ కూడా వెళ్లలేని దుస్థితి ● ఢిల్లీ, అమీర్‌పేట ఘటనల నుంచి పాఠాలు నేర్వకపోతే కష్టమే..

ఇకనైనా దృష్టి సారించకపోతే..

● ఖమ్మంలో సెట్‌బ్యాక్‌ లేకుండానే నిర్మాణాలు ● ఇరుకు సందుల్లో అంతస్తులపై అంతస్తులు ● అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్‌ కూడా వెళ్లలేని దుస్థితి ● ఢిల్లీ, అమీర్‌పేట ఘటనల నుంచి పాఠాలు నేర్వకపోతే కష్టమే..

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా విస్తరిస్తూ, ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో వాణిజ్య, వ్యాపార లావాదేవీలు రెట్టింపయ్యాయి. ఇదే వేగాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రియల్టర్లు, భవన యజమానులు నిబంధనలను బేఖాతరు చేస్తూ.. నగరంలోని చిన్నచిన్న గల్లీల్లో సైతం భారీ భవనాలను నిర్మిస్తున్నారు. భవనం – భవనానికి మధ్య కనీస ఖాళీ స్థలం(సెట్‌బ్యాక్‌) లేకుండా పాత భవనాలను ఆనుకుని కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అడ్డగోలు నిర్మాణాల కారణంగా భారీ ప్రమాదాలు జరిగితే కోలుకోలేని నష్టం ఎదురయ్యే అవకాశం ఉండడం ఆందోళనలకు గురిచేస్తోంది.

తప్పించుకునే దారి లేకుండా..

నగరంలో కొత్త భవనాల నిర్మాణాల సమయాన కనీస నిబంధనలు పాటించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాదం జరిగితే భవనాల్లోని ప్రజలు ప్రాణాలు దక్కించుకుని బయటకు తప్పించుకునేందుకు కూడా వీల్లేకుండా ఈ నిర్మాణాలు సాగుతుండడం గమనార్హం. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగితే మంటలను ఆర్పే అగ్నిమాపక యంత్రం లోపలికి వెళ్లే పరిస్థితి కూడా కానరావడం లేదు. నాలుగైదు అంతస్తుల భవనాలను నిర్మిస్తే భవనం చుట్టూ ఫైర్‌ ఇంజన్‌ తరిగేలా సెట్‌బ్యాక్‌ వదలాలి. కానీ ఖమ్మంలో అలాంటివి లేకుండానే భారీ భవనాలను నిర్మిస్తున్నారు. నివాస భవనాలే కాక వాణిజ్య భవనాల్లో ఇదే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఆ సందులు ఇరుకుమయం..

ఖమ్మంలోని ప్రధాన వ్యాపార కేంద్రాలైన కమాన్‌బజార్‌, కస్బాబజార్‌, అజీజ్‌ గల్లీతో పాటు వైరా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇరుకు సందుల్లో వాహనాలు వెళ్లేందుకు కనీస దారి కూడా లేకుండా భవనాలను నిర్మించేశారు. పలుచోట్ల ఫైర్‌ ఇంజన్‌ మాటేమో కానీ ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మించిన ఇటువంటి భవనాలపై మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కనీసం పట్టింపు కూడా లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదనే ఆరోపణలున్నాయి. వైరా రోడ్డుకు ఇరువైపుల ఉన్న కొన్ని భవనాల యజమానులు జనరేటర్లను సైతం కార్పొరేషన్‌ డ్రెయినేజీలపై ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇది ఖమ్మంలోని అజీజ్‌ గల్లీ. రెండు వైపులా షాపులు, వాటి ముందు షాపులకు సంబంధించి

సామగ్రి. ఆపై షాప్‌లకు వచ్చే వారి వాహనాలు. కొనుగోళ్లకు వచ్చివెళ్లే వారితో ఇదే కాక మరికొన్ని గల్లీలు నిత్యం రద్దీగా ఉంటాయి. దీంతో కార్లు వంటివి ఏమో కానీ కనీసం ద్విచక్ర వాహనదారులు సాఫీగా వెళ్లలేని పరిస్థితి. ఇక ఇలాంటి గల్లీల్లో ఏదైనా ప్రమాదం జరిగితే సహాయక చర్యలు

చేపట్టడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు.

™égêV> ÉìlÎÏÌZ° K çßZrÌŒæ-ÌZ fÇW¯]l AW²{ç³-Ð]l*-§ýl…-ÌZ 21Ð]l$…¨ çÜiÐ]l §ýlçßæ-¯]l-Ð]l$-Ķæ*ÅÆý‡$. A…™ól-M>MýS ÉìlÎÏÌZ Csîæ-Ð]lÌS K ´ë™èl ¿ýæÐ]l¯]l… MýS$ç³µ-MýS*-Í…¨. AÌêVóS, Oòßæ§ýl-Æ>»ê§Šæ-ÌZ° AÒ$ÆŠ‡-õ³-rÌZ ¿êÈ AW²{ç³-Ð]l*§ýl… fÇW…¨. D çœ$r¯]l-ÌS¯]l$ E§éçßæ-Ç-çÜ*¢ ¯]lVýS-Æý‡…-ÌZ° °Æ>Ã-×êÌS¯]l$ ^èl*çÜ$¢¯]l² f¯]l… Ð]l×ìæ-MìS-´ù-™èl$-¯é²Æý‡$. CÆý‡$MýS$ çÜ…§ýl$-Ë$, òÜsŒæ-»êÅ-MŠS-Ë$ ÌôæMýS-´ù-Ð]lyýl… Ð]lÌôæÏ AMýSPyýl çÜàĶæ$MýS ^èlÆý‡Å-ÌSMýS$ ¡{Ð]l Br…MýS… HÆý‡µ-yìl…¨. CÌê…sìæ çœ$r¯]l-Ë$ ^èl*OòÜ-¯é A«¨M>Æý‡$-Ë$ MýSâ¶æ$Ï ™ðlÆý‡-ÐéÌS° {ç³fË$ MøÆý‡$-™èl$-¯é²Æý‡$. QÐ]l$Ã…ÌZ ¿ýæÑçÙÅ-™Œæ-ÌZ H {ç³Ð]l*§ýl… fÆý‡-Vö§ýlª-¯]l$-MýS$…sôæ ¿ýæÐ]l¯]l °Æ>Ã-×êÌS A¯]l$-Ð]l$-™èl$-ÌZÏ A«¨M>Æý‡$-Ë$ MýSv¯]l…-V> Ð]lÅÐ]l-çßæ-Ç…^éÌS°, °º…«§ýl-¯]l-Ë$ EÌSÏ…-íœ$…_¯]l ÐéÇOò³ MýSv¯]l ^èlÆý‡Å-Ë$ ¡çÜ$-MøÐéÌS° yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æý‡$. ☻

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement