భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. మేతకు వెళ్తున్న సమయాన కనుచూపు మేర నీరు దొరకక అవస్థ ఎదుర్కొంటున్నాయి. గతంలో మాదిరి తొట్లు లేకపోవడంతో ఎక్కడ నీరు
దొరుకుతుందా అని జీవాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని పండితాపురంలో గురువారం మేకల గుంపు మేతకు వెళ్తుండగా.. రైతు కొమ్మినేని వెంకటేశ్వర్లు తన వ్యవసాయ బావి మోటార్ ఆన్ చేశాడు. దీంతో మేకలతో పాటు ఇతర జీవాలు చేరుకుని ఇలా దప్పిక తీర్చుకున్నాయి.
– కామేపల్లి


