ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని హులికట్టి గ్రామంలో పంట పొలానికి వెళ్లిన ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. యంకప్ప(60) ఎలుగుబంటి దాడికి గురయ్యాడు. అడవి జంతువుల బారి నుంచి తన పంటను కాపాడుకోడానికి అతను పొలానికి వెళ్లినప్పుడు, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తల, ముఖం, చేతులపై కరిచి తీవ్రంగా గాయపరిచింది.

బావిలో పడి బాలుడు మృతి

క్రిష్ణగిరి: బావిలో నంచి నీరు తేవడానికి తల్లితో కలిసి వెళ్లిన మూడేళ్ల బాలుడు బావిలో పడి చనిపోయిన ఘటన బేరికె వద్ద జరిగింది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా కడతూరుకు చెందిన వెంకటేష్‌ (25), భార్య చిత్ర. వీరికి లోకేష్‌ (3) అనే కుమారుడు, ఏడాదిన్నర కూతురు ఉన్నారు. వెంకటేష్‌ ఓ రైతు పొలంలో కుటుంబంతో కలిసి ఉంటూ కూలి పనులు చేసేవాడు. ఆదివారం సాయంత్రం చిత్ర బావి నుంచి నీరు తీసుకొచ్చేందుకు కొడుకుతో కలిసి వెళ్లింది. ఈ సమయంలో బాలుడు లోకేష్‌ ఆకస్మాత్తుగా కాలు జారి బావిలో పడిపోయాడు. ఎవరూ కాపాడలేకపోవడంతో అతడు చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement