బళ్లారిటౌన్: నగరానికి చెందిన ప్రముఖ చిత్రలేఖన కళాకారుడు, ప్రముఖ హిందుస్తానీ గాయకుడు జాలిబెంచి దొడ్డబసవాచార్య గవాయి మనవడు మంజునాథ్ గోవిందవాడ(52) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంజునాథ్ లలితకళా అకాడమి అవార్డును పొందారు. ఆయన సైకత, తైల, జలవర్ణంలో చిత్రకళను ప్రదర్శించేవారు. హంపీ ఉత్సవాలతో పాటు వివిధ సభలు, సమావేశ వేదికల్లో స్వాగత బ్యానర్లను రూపొందించి ఆకట్టుకున్నారు. ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, ప్రముఖులు ఎన్.ప్రతాప్‌రెడ్డి, టీహెచ్‌ఎం బసవరాజు, నిష్టిరుద్రప్ప, వీరభద్రగౌడ, అధికారులు చోరనూరు కొట్రప్ప, బీ.నాగరాజు, కళాకారులు హంద్యాళ్ పురుషోత్తం, శంకరబండె యల్లనగౌడ, ఆదోని వీణా, తిప్పేస్వామి, రమణప్ప తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
21న బోవి సమావేశం
హోసూరు: హోసూరులో జూన్ 21వ తేదీ జరగనున్న క్రిష్ణగిరి జిల్లా బోవి సముదాయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యవర్గ కమిటీ నిర్వాహకులు కోరారు. హోసూరు చెరువు వీధి సమీపంలోని అమ్మన్ సెలబ్రేషన్ హాలులో జరుగుతుందని, పెద్దఎత్తున సముదాయ ప్రజలు పాల్గొని, తమ వర్గం అభివృద్ధిపై చర్చించాలని కోరారు.


