ఎలా జరిగింది?
ఇది ఆకస్మికంగా చెలరేగిన అగ్ని ప్రమాదం. కరెంటు వైర్ల నుంచి మంటలు పుట్టి వ్యాపించగా, గ్యాస్ సిలిండర్ పేలడంతో పరిస్థితి అదుపు తప్పింది. పైగా బార్ రెస్టారెంటులో మండే పదార్థాలతో తయారైన సోఫాలు, కుర్చీలు, చెక్క సామగ్రి ఉండడంతో మంటల ధాటికి అద్దు లేకుండా పోయింది. ఆ సమయంలో సుమారు 30 మంది కస్టమర్లు, 15 మంది దాకా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మహిళా సిబ్బంది పై అంతస్తు నుంచి కిందికి రాలేక హాహాకారాలు చేయసాగారు. ఈ దుర్ఘటనలో ప్రకాష్, షాహిన్ అనే వలస కార్మికులు దుర్మరణం చెందగా, బార్ యజమాని ప్రీతంతో సహా 10 మంది వరకూ సిబ్బంది, వినియోగదారులు గాయాల పాలయ్యారు. స్థానికులు పలువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. బార్ బయట భారీగా జనం గుమిగూడారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పిన తరువాత మృతదేహాలను వెలికితీశారు. లోపల మొత్తం సామగ్రి బొగ్గుల మాదిరిగా మారింది. పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. పోలీసు, ఫైర్ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘోర అగ్ని ప్రమాదం మైసూరుతో పాటు ఇతర నగరాల్లోని బార్– రెస్టారెంట్లు, పబ్బుల్లో సురక్షిత చర్యలపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
మైసూరు: అది మైసూరులోని దత్త గల్లిలోని ఫాక్స్ డెన్ లిక్కర్ గ్యారేజ్ పేరు గల బార్ అండ్ రెస్టారెంట్, పబ్ సముదాయం. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయం.. కస్టమర్లు మద్యం తాగుతూ మజాగా ఉన్నారు. సీ్త్ర, పురుష వెయిటర్లు సప్లై చేస్తూ ఉండగా సంగీతంతో వాతావరణం హుషారుగా ఉంది. ఇంతలోనే హఠాత్తుగా మంటలు, పొగ చుట్టుముట్టాయి. ఏమి జరుగుతోందో అర్థం కాక కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో తలో దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఒకటి, రెండు అంతస్తుల్లోని వారు కిందకు రావడానికి మెట్ల వద్దకు వెళ్తే అక్కడ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో పై నుంచి ఆర్తనాదాలు చేయసాగారు. మరికొందరు మొండిధైర్యంతో కిందకు దూకేశారు.
మైసూరులో భారీ అగ్ని ప్రమాదం
ఇద్దరు సిబ్బంది మృతి
10 మందికి గాయాలు


