మైషుగర్‌లో అక్రమాల పర్వం | - | Sakshi
Sakshi News home page

మైషుగర్‌లో అక్రమాల పర్వం

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

మండ్య: మైషుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆగడాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టన్ను చెరకుకు రూ. 5 వేలు చెల్లించాలని రైతులు, సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సేవ్‌ మైషుగర్‌ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల రైతు ప్రజా ఉద్యమం మొదటి దశ సోమవారం ప్రారంభమైంది. చిక్కమండ్యలో జరిగిన ర్యాలీలో కమిటీ నాయకులు మాట్లాడుతూ, మైషుగర్‌ ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటీకరించారని ఆరోపించారు. ఫ్యాక్టరీ ఆదాయం ఆధారంగా టన్ను చెరకుకు రూ. 5,000 అందించడం సాధ్యమే. అయినప్పటికీ, అసమర్థ పరిపాలన, అవినీతి కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో చెరకును క్రషింగ్‌ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ప్రైవేట్‌ చక్కెర కర్మాగారాలు చెరకు రైతులను దోచుకుంటున్నాయన్నారు. స్థలాలు, వాహనాలతో పాటు ఫ్యాక్టరీలో అనేక రకాల అక్రమాలు జరుగుతున్నయని ఆరోపించారు. జిల్లా ప్రజాప్రతినిధుల మౌనం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. రైతులు పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ప్రముఖ రైతు నేతలు, అన్నదాతలు పాల్గొన్నారు.

చెరకు రైతులను ఆదుకోవాలని ధర్నా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement