కోలారు: కోలారు నగరంలోని శృంగేరి శారదా మఠంలో శ్రీరామ పట్టాభిషేకం, రామ తారక హోమం ఆదివారం భక్తిశ్రద్ధలతో, రమణీయంగా జరిగాయి. గోపూజతో సీతారామ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీరామచంద్రుల ఊరేగింపు, మహిళల కోలాట నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకను కనులారా వీక్షించి తరించారు. మహా నీరాజనం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది. సునీల్ శర్మ, అప్పణ్ణశాస్త్రి, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


