ఉత్తమ వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ వైద్య సేవలందించాలి

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

రాయచూరు రూరల్‌: నగరంలోని రాగిమానుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ప్రత్యేక ఆరోగ్య చికిత్స శిబిరాలను జాతీయ ఆరోగ్య అభియాన అధికారిణి నందిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో తరుచుగా వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. వైద్య శిబిరానికి దాదాపు 250 మంది హాజరయ్యారు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, చికెన్‌గున్యా, మలేరియా, డెంగ్యూ, క్షయ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు పుష్పలత, సరోజ, నితీష్‌, తాలూకా ఆరోగ్య అధికారి పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సేవలు అనన్యం

రాయచూరు రూరల్‌: ఉద్యోగ విరమణ సహజమే. అయితే ఉద్యోగులు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిప్రాయపడ్డారు. ఆదివారం నగరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వెంకోబ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు వెంకోబ విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం శ్రమించారని తెలిపారు. కార్యక్రమంలో సిద్దరూడ మఠాధిపతి నిజానంద స్వామిజీ, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, వెంకోబ, అమరేష్‌, పాగుంటప్ప తదితరులు పాల్గొన్నారు.

మొక్కలతో

పర్యావరణ పరిరక్షణ

రాయచూరు రూరల్‌: నగరంలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి విరివిరిగా మొక్కలు నాటాలని నవోదయ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజాశంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం శ్రీరామలింగేశ్వర దేవాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు.

రక్తదాన శిబిరం

రాయచూరు రూరల్‌: రక్తదాన శిబిరాలు, రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత సూచించారు. ఆదివారం ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప, దండెప్ప బిరదార్‌, తిమ్మప్ప, శారద తదితరులు పాల్గొన్నారు.

గుట్కా సీజ్‌, ఇద్దరి అరెస్టు

హోసూరు: బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు ద్విచక్రవాహనంలో గుట్కా తరలిస్తున్న ఇద్దరిని సిఫ్‌కాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూజువాడి చెక్‌పోస్ట్‌ వద్ద బైక్‌ను అడ్డగించి తనిఖీ చేయగా రూ. 24 వేలు విలువ చేసే 36 కేజీల గుట్కా పట్టుబడింది. ద్విచక్రవాహనంతో పాటు, కోయంబత్తూరు సమీపంలోని నల్లంపాళ్యంకు చెందిన శివకుమార్‌ (33), లింగరాజ్‌ (26)ను అరెస్టు చేశారు.

కూలీపై దుండగుల దాడి

హోసూరు: బేరికె సమీపంలో భవన నిర్మాణ కార్మికునిపై కొందరు దాడి చేశారు. హోసూరు తాలూకా బేరికె మసీపంలోని తట్టనపల్లి గ్రామానికి చెందిన ఆర్ముగం (50) బేల్దారీ పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కురుబరపల్లిలో పనికి వెళ్లాడు, మరుసటి రోజు ఓ మామిడి తోటలో తీవ్ర గాయాలతో పడి ఉండగా, స్థానిక ప్రజలు చూసి అతని భార్య పూంగొడికి తెలిపారు. ఆమె ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన భర్తను చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పూంగొడి ఫిర్యాదు మేరకు బేరికె పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement