బళ్లారి తాలూకాలోని దాసర నాగేనహళ్లి నేరేడు పండ్ల తోటలకు పెట్టింది పేరు. ఈ గ్రామంలోని రైతుల తోటల్లో నేరేడు చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ ప్రారంభం కావడంతో బాగా దిగుబడి వచ్చింది. వ్యాపారులు తక్కువ ధరకు నేరేడు కాయలను అడుగుతుండటంతో రైతులే నేరుగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. కిలో నేరేడు పండ్లను రూ.100 నుంచి రూ.150 చొప్పున బహిరంగ మార్కెట్‌లో విక్రయించి ఆదాయం గడిస్తున్నారు. నేరేడు పండ్లలో విటమిన్లు సి, ఏ, ఐరన్, కాల్షియం, పొటాషియం, యూంటి ఆక్సిడెంట్లు, సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం (షుగర్) వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు దివ్య ఔపధంగా ఉపయోగపడుతుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రజలు కూడా తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, బళ్లారి:


