దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలో కలకలం రేపిన మాజీ జవాన్ సందీప్ మంజరగి (45) హత్య కేసులో నిందితుడు పుండలీక దొంబర్ సెల్ఫీ వీడియోలో నిజం ఒప్పుకున్నాడు. రిటైర్డు ఆర్మీ జవాన్ సందీప్ మంజరగి పేరున రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ ఉండగా, భర్తను అడ్డు తొలగించి ఆ డబ్బును కొట్టేయడంతో పాటు ప్రియునిగా ఉండిపోవచ్చని సందీప్ భార్య కథ నడిపించినట్లు తెలిసి బంధుమిత్రులు, స్థానికులు నిర్ఘాంతపోయారు. సందీప్ భార్య సుమ (40), ప్రియుడు పుండలీక (26)ను యమకనమరడి, చిక్కోడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనైతిక సంబంధాల కారణంగా జరుగుతున్న జీవిత భాగస్వాముల హత్యలకు ఈ ఘటన మరోసారి దారుణ ఉదాహరణగా నిలిచింది. వివరాలు.. మార్చి 13న సందీప్, తన వద్ద పనిచేసే పుండలీకతో కలిసి బైక్‌పై జాతరకు వెళ్లి వస్తుండగా యమకనమరడి ఠాణా పరిధిలో ఘటప్రభ వద్ద ప్రమాదం జరిగి, సందీప్ ఓ మోస్తరుగా గాయపడ్డాడు. పుండలీక్‌కు చిన్న చిన్న గాయాలయ్యాయి. సందీప్ చిక్కోడిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 15న చనిపోయాడు. పెద్ద గాయాలేవీ లేకున్నా ఎలా చనిపోయాడని బంధువులు అనుమానపడ్డారు. సుమ ప్రవర్తనపై అనుమానం వచ్చిన సందీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి, సుమపై నిఘా పెట్టారు. అనుమానం బలపడడంతో సుమను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు పుండలీక శనివారం సెల్ఫీని విడుదల చేశాడు. సుమ, తాను ఈ హత్యకు కారణమని పేర్కొన్నాడు.
ప్రియుడు పుండలీక సెల్ఫీ వీడియో
సైలెన్‌లోకి విషపు సూది గుచ్చి...
బెళగావిలో మిస్టరీ వీడిన రిటైర్డు
ఆర్మీ జవాన్ హత్య కేసు
మహిళ, ఆమె ప్రియుని అరెస్టు
నిందితుడు
ఏం చెప్పాడు?
సుమ తనను ప్రేమిస్తున్నానని చెప్పి ట్రాప్ చేసిందని, సందీప్‌ని సాగనంపి నీ ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లలు సంతోషంగా జీవిద్దామని చెప్పిందని, ఆ తరువాత ఆమె ప్లాన్ చేసి సందీప్‌ని చంపిందని పుండలీక సెల్ఫీలో చెప్పాడు. మరోవైపు పోలీసులు పూడ్చిపెట్టిన సందీప్ శవాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం జరపడంతో పాటు ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాలను సేకరించే పనిలో ఉన్నారు. భర్తను పాశవికంగా చంపిన సుమను, ఆమె ప్రియున్ని కఠినంగా శిక్షించాలని సందీప్ కుటుంబీకులు, బంధుమిత్రులు డిమాండ్ చేశారు.
అనైతిక బంధం ఏర్పడి...
సందీప్ ఆర్మీ నుంచి రిటైరయ్యాక ఓ హోటల్‌ను పెట్టాడు, అందులో పనికి పుండలీకను నియమించుకున్నాడు. ఈ సమయంలో సుమతో పుండలీకకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమకు అడ్డుగా ఉన్న సందీప్‌ను హతమార్చాలని అనుకునేవారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా జరిగిన బైక్ ప్రమాదంలో సందీప్ గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతని మీద రూ.2 కోట్ల బీమా పాలసీ ఉండడం, తమ ఆనందానికి అడ్డుగా నిలిచాడని భార్య సుమ కుట్రను రచించింది. మార్చి 15న సిరెంజిలో పురుగుల మందును తీసుకుని దానిని భర్తకు ఎక్కిస్తున్న గ్లూకోజ్ సీసాలోకి నింపింది. కొంతసేపటికి చనిపోయాడు. తరువాత అంత్యక్రియలను పూర్తి చేశారు.


