దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో తీవ్రంగా, బెంగళూరు– రూరల్, మండ్య, మైసూరు, చామరాజనగర ,రామనగర, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, విజయనగర తదితర జిల్లాల్లోనూ వర్షాలు కురవవచ్చు. ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. బెంగళూరులో వానలతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
యాణ పర్యాటక కేంద్రం బంద్
యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. దీనితో యాణ పర్యాటక కేంద్రానికి టూరిస్టులు వెళ్లకుండా కట్టడి చేశారు. కారవారలో ఉరుములు–మెరుపులతో వానలు పడుతున్నాయి. కుమటా తాలూకాలో ప్రసిద్ధ టూరిస్టు స్పాట్ యాణకు రోడ్లను బంద్ చేశారు. భూమి కంపించవచ్చని, కొండచరియలు విరిగిపడవచ్చని చెబుతున్నారు. చండికా నది కాలువ పోటెత్తింది.
వాతావరణ శాఖ హెచ్చరిక


