భగవాన్‌పై కేసుల పరంపర | - | Sakshi
Sakshi News home page

భగవాన్‌పై కేసుల పరంపర

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

సాక్షి,బళ్లారి: ప్రముఖ రచయిత, హేతువాది, ఆలోచనాకారుడు కే.ఎస్‌.భగవాన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హరిహర పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శ్రీరాముడి పుట్టుకకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భగవాన్‌ మాట్లాడుతూ శ్రీరాముడు దశరథ మహారాజు పుత్రుడు కాదని, వాల్మీకి రామాయణంలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పుత్రకామేష్టి యాగానికి సంబంధించిన విషయాలను ఉదహరిస్తూ తన వాదనను సమర్ధించుకున్నారు. అంతేకాకుండా రామాయణంలో కొన్ని సంఘటనలు ప్రస్తావిస్తూ రాముడి పాత్రపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖలు చేయడంతో భక్తులు మండిపడుతున్నారు. భగవాన్‌ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, రామ భక్తులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వార్లల్లో నిలవడానికి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కే.ఎస్‌.భగవాన్‌పైఽ ధార్వాడ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కేసులు కూడా నమోదు చేశారు. శ్రీరామసేవ వ్యవస్థాపకులు ప్రమోద్‌ ముతాలిక్‌ తదితర ప్రముఖులు ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దశరథ మహారాజు పుత్రుడు

శ్రీరాముడు కాదు

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా రచయితపై ఆగ్రహ జ్వాలలు

భక్తుల మండిపాటు, పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement