బనశంకరి: దోపిడీ, హత్యాయత్నం తదితర తీవ్రమైన నేరాలతో సంబంధమున్న రౌడీషీటర్ జీవా (19)పై గురువారం బెంగళూరు హెబ్బగోడి పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్‌చేశారు. పలు దోపిడీలకి పాల్పడి పరారీలో ఉన్న జీవా కోసం పోలీసులు కొన్నిరోజులుగా వెతుకున్నారు. గురువారం తెల్లవారుజామున సింగేన అగ్రహార తోపులో దాగి ఉన్నట్లు తెలిసి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతుండగా అతని వెంటపడ్డారు. అతడు కత్తితో పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఎస్‌ఐ అయ్యప్ప తుపాకీతో కాల్పులు జరిపాడు.
తూటా తగిలి జీవా కాలికి గాయం కావడంతో పడిపోగా, పోలీసులు పట్టుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హెబ్బగోడి ఠాణాలో రౌడీషీటర్ అయిన ఇతడు తిరుపాళ్యలో నివాసం ఉంటున్నారు. తరచూ నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారాడు.


