హొసపేటె: తాలూకాలో మరియమ్మనహళ్లి గుండా తండాకు చెందిన రైతుల భూములను కలిపే దారి పాడై పోవడంతో రాకపోకలు కష్టకరంగా మారాయి. ఈ దారిపై నరకయాతన పడుతూ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు నిద్రావస్థలో ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు. జీ.నాగలాపుర జీపీ పరిధిలోకి వచ్చే గుండా తండాలోని రైతుల పొలాలకు చేరుకోవడానికి ఉన్న ఏకై క మార్గం ఈ దారి. దీనిపై చాలా గుంతలు ఉన్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. దారి బురదమయంగా మారడంతో పొలాలకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. విత్తనాలు నాటే, పంట కోసే సమయాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోంది. ఈ దారిలో వాహనదారుల తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికై నా దారిని వెంటనే మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరారు.
యాతన పడుతున్న వాహన చోదకులు


