రాయచూరు రూరల్: రాష్ట్రంలో హిందువులను అడ్డుకోవడం తగదని హిందూ సంఘాల కార్యకర్త పునీత్ కెరెనళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మైసూరు నుంచి రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టిలో జరిగే హిందూ సమావేశానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడంతో పాటు జిల్లాలోకి ప్రవేశాన్ని నిర్బంధిస్తూ జిల్లాధికారిణి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తాను మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చానని, నోటీసులు స్వీకరించడం వీలు కాదని పోలీసులతో వాగ్వాదం చేశారు. హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, హిందూ సమావేశానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం తగదని పునీత్ ఆరోపించారు. రాయచూరు జిల్లాలో ప్రవేశించే సమయంలో నోటీసులు జారీ చేయాలని, అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.


