హొసపేటె: తన మామిడి పండ్లకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఒక రైతు కలకేరి–వడకి రహదారిపై సుమారు 3 క్వింటాళ్ల మామిడి పండ్లను రోడ్డు పక్కన కుమ్మరించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాకు చెందిన రైతు ఈశప్ప పండించిన మామిడి పండ్లకు మార్కెట్ ధర పడిపోవడంతో, అతనికి కూలీ సొమ్ము కూడా అందడం లేదు. మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న ఆ రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో అతను తన ఆటోలో తెచ్చుకున్న మామిడి పండ్లను రోడ్డు పక్కన పారబోశాడు. పంట పండించడానికి పెట్టిన పెట్టుబడి డబ్బు కూడా తిరిగి రావడం లేదు. పంట కోతకు, రవాణాకు అయ్యే కూలీ సొమ్ములు కూడా చెల్లించడానికి కావడం లేదు. ఏం చేయాలో తెలియక విసిగి పోయి, వాటినంతా రోడ్డు పక్కన పారవేశాను అని రైతు ఈశప్ప తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
పెట్టుబడి దక్కక 3 క్వింటాళ్ల పండ్లను రోడ్డు పక్కన పారబోసిన రైతు


