జన జాతరగా చేప మందు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

జన జాతరగా చేప మందు పంపిణీ

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

రాయచూరు రూరల్‌: ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా పర్యటనకు వచ్చారా? లేక ఏదైనా జాతర, రథోత్సవానికి వచ్చారా? అనే విధంగా చేప మందు కోసం వేలాదిగా జనం తరలి వచ్చారు. సోమవారం సాయంత్రం కొప్పళ తాలూకా కుటుగానహళ్లిలో అశోక్‌రావ్‌ కులకర్ణి చేప మందును తమలపాకులో పంపిణీ చేశారు. మృగశిర కార్తెలో ఆయాసం, ఉబ్బసం ఇతర వ్యాధులు సోకిన వారికి చేప మందు వాడడం వల్ల వ్యాధి నయమవుతుందనే నమ్మకంతో గత 70 ఏళ్ల నుంచి చేప మందును పంపిణీ చేస్తున్నారు.

ఈనేపథ్యంలో వందలాది కి.మీ.ల దూరం నుంచి ప్రజలు చేప మందు కోసం ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చి రాత్రి ఇక్కడే బస చేసి మందును తీసుకున్నారు.

భారీగా కొప్పళకు తరలి వచ్చిన ప్రజలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement