నగరంలో భారీగా పేలుడు సామగ్రి | - | Sakshi
Sakshi News home page

నగరంలో భారీగా పేలుడు సామగ్రి

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

బనశంకరి, కృష్ణరాజపురం: బెంగళూరు నగర శివారులో 225 జిలెటిన్‌ స్టిక్స్‌, 50 డిటోనేటర్లు ఉన్న బాక్సులు లభ్యమయ్యాయి. వైట్‌ఫీల్డ్‌ ఆవలహళ్లి కాడ అగ్రహార వద్ద భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలను నిల్వ చేశారని తెలిసి ఆవలహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించారు. వాటిలో క్వారీలు, గనులలో పేలుళ్లకు ఉపయోగించే జిలెటిన్‌ కడ్డీలు, డిటోనేటర్లు కనబడ్డాయి. బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. వెంకటరామరెడ్డి, మధుసూదన్‌, పునీత్‌, వికాస్‌, సందీప్‌, తౌహీద్‌, అంబరీశ్‌, వేలు అనే వారిపై కేసు నమోదు చేశారు. బండరాళ్లు పేల్చడానికి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. కానీ ఎలాంటి రికార్డులు లేకుండా పేలుడు పదార్థాలను కొని, నిల్వ చేయడం చట్ట విరుద్ధమని పోలీసులు తెలిపారు. ఇటీవల బెంగళూరు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రోడ్డులో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సమయంలో జిలెటిన్‌ కడ్డీలు దొరకడంతో భద్రతా లోపమని విమర్శలు వచ్చాయి. యరపనహళ్లి విధానసౌధ లే ఔట్‌లో అక్రమంగా వీరు గ్రానైట్‌ క్వారీని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. క్వారీకి ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు.

ఆవలహళ్లిలో స్వాధీనం

పలువురి అరెస్టు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement