యశవంతపుర: పలు జిల్లాల్లో నైరుతీ ముంగారు వానలు జోరుగా కురుస్తున్నాయి. వారం రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని బెంగళూరు వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. కరావళిలోని దక్షిణ ఒళనాడు భాగంలో అతి భారీ వానలు కురుస్తాయని తెలిపారు. రుతుపవనాలు రెండు రోజుల్లో విస్తరించి దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాలో మంగళవారం నుంచి వర్షాలు పడవచ్చు. బెంగళూరు చుట్టుపక్కల 2 రోజుల పాటు మేఘావృతమై ఉంటుంది. సిటీలో 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చిక్కమగళూరులో సోమవారం కూడా జోరు వాన కురవడంతో జన జీవనం స్తంభించింది.


