రాయచూరు రూరల్: అభివృద్ధి పనుల పేరుతో రూ.కోట్లలో నిధులు లూటీ చేశారు. కానీ స్థానికులకు ఉద్యోగాలు మాత్రం దక్కలేదు. 2009లో ప్రారంభించిన యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్) గత 16 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. కేవలం 800 మంది ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రూ.12,915 కోట్లు పెట్టుబడి పెట్టగా నేడు హైదరాబాద్ మేక్ పవర్ ప్రాజెక్టు కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 700 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నారు. ప్రారంభంలో రూ.8,806 కోట్లు అంచనా వ్యయం కాగా రూ.12,915 కోట్లు వ్యయం చేశామని, అదనంగా రూ.4,109.67 కోట్లు ఖర్చు చేసినట్లు మేక్ పవర్ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. రూ.12,247 కోట్లు కేపీసీఎల్‌కు అప్పు మిగిల్చారు. కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకునే వారు కరువయ్యారు. నాణ్యతతో కూడిన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంపై కంపెనీ శ్రద్ధ కనబరచలేక పోయిందని కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. అప్పుల సుడిగుండంలో రాయచూరులోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఊగిసలాడుతోందని అన్నారు.
వైటీపీఎస్‌లో స్థానికులకు
దక్కని ఉద్యోగాలు
కంపెనీ నిర్మాణానికి మొత్తం
రూ.12,915 కోట్ల వ్యయం


