జనం నుంచి రూ.2,400 కోట్ల డిపాజిట్లు | - | Sakshi
Sakshi News home page

జనం నుంచి రూ.2,400 కోట్ల డిపాజిట్లు

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

బనశంకరి: బెళగావిలో సంచలనం సృష్టించిన శివం అసోసియేట్స్‌ యజమాని శివానంద నీలణ్ణవర్‌ 40,700 మంది నుంచి రూ.2,400 కోట్ల డిపాజిట్లు పెట్టుబడి పెట్టించాడని సీఐడీ డీఐజీ భీమాశంకర్‌ గుళేద్‌ తెలిపారు. ఆదివారం బెళగావిలో భీమాశంకర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా వచ్చిన డబ్బు నుంచి పాతవారికి వడ్డీ ఇచ్చేవాడు. వడ్డీల మొత్తం పెరిగితే డబ్బులు ఇవ్వడం నిలిపివేసేవాడు. ప్రజల నుంచి రూ.2,400 కోట్లు సేకరించాడు, ఇందులో చాలావరకు ప్రజలకు చెల్లించాడు. రూ.540 కోట్లు షేర్‌ మార్కెట్‌లో పెట్టాడు. ఇందులో రూ.170 కోట్లు నష్టపోయాడు. రూ.660 కోట్ల లోటు ఏర్పడింది’ అని వివరించారు. నిందితుడు శివానంద డిపాజిట్లకు అధిక వడ్డీల పేరుతో బెళగావి, పరిసర జిల్లాల్లో ప్రజలు, ఉద్యోగుల నుంచి భారీమొత్తంలో డిపాజిట్లు సేకరించి, తిరిగి ఇవ్వడం లేదని ఆరోపణలు రావడం తెలిసిందే. శివానంద సొంతానికి రూ.55 కోట్లు వాడుకున్నాడని తెలిపారు. 5 లగ్జరీ కార్లను సీజ్‌ చేశామన్నారు. మహారాష్ట్రలోనూ ఎక్కువమంది పెట్టుబడులు పెట్టారని, అక్కడా దర్యాప్తు జరుగుతోందని భీమాశంకర్‌ తెలిపారు. రికవరీలు చేసిన తరువాత ప్రత్యేక అధికారి ద్వారా ప్రజలకు నగదు వెనక్కి ఇస్తామని తెలిపారు.

40 వేల మందికి పైగా బాధితులు

శివం స్కాంపై సీఐడీ డీఐజీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement