శివాజీనగర: కొత్త ప్రభుత్వంలో అలకలు తగ్గాయి. మంత్రి రామలింగారెడ్డి తనకు నచ్చిన శాఖను ఇవ్వలేదని మంత్రి పదవికి రాజీనామా చేయగా హైకమాండ్ దూతలు చర్చలు జరిపారు. ‘శుక్రవారం రాత్రి నాతో సీఎం డీకే శివకుమార్, పార్టీ ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా భేటీ అయ్యారు. వారితో మాట్లాడాను. వారు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో వేచి చూస్తా’ అని రామలింగారెడ్డి శనివారం ఉదయం విలేకరులకు తెలిపారు. ఓ హోటల్‌లో భేటీ చేసి సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు. ‘నా రాజకీయ జీవితంలో ఎలాంటి నిర్దిష్టమైన శాఖను కోరుకోలేదు. అయితే ఇచ్చిన భరోసా నెరవేర్చని నేపథ్యంలో నిరాశకు గురయ్యాను. రాజీనామాను వాపస్ తీసుకోవాలని సుర్జేవాలా విన్నవించారు. ఎన్నిసార్లు కోరినా అంగీకరించను. ముఖ్యమంత్రి, సుర్జేవాలా ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తాను’ అని తెలిపారు.
రాజీనామా వెనక్కి: సుర్జేవాలా
బనశంకరి: రామలింగారెడ్డి, కృష్ణబైరేగౌడతో రణదీప్‌సింగ్ సుర్జేవాలా సుమారు గంటపాటు చర్చించారు. బుజ్జగింపులతో రామలింగారెడ్డి రాజీనామాను వెనక్కి తీసుకున్నారని సుర్జేవాలా ప్రకటించారు. రామలింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని అన్నారు. ఆయనకు అదనపు శాఖ ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. రామలింగారెడ్డి విషయంలో బీజేపీ గందరగోళం సృష్టించిందని ఆయన ఆరోపించారు. సీఎం శివ కూడా ఆయన రాజీనామాను ఆమోదించబోనని చెప్పారు. చివరకు రామలింగారెడ్డి పదవిలో కొనసాగుతానని తెలిపారు.
ఇవన్నీ సాధారణమే: డీసీఎం
శివాజీనగర: రాజీనామా చేసిన రామలింగారెడ్డితో సీఎం మాట్లాడారు, మరో మంత్రి మునియప్పలో ఎలాంటి అసంతృప్తి లేదు, రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వ సాధారణమని డీసీఎం పరమేశ్వర్ అన్నారు. తన రెవెన్యూ శాఖ గురించి త్వరలో విలేకరుల సమావేశంలో వివరిస్తానని తెలిపారు.
సీఎం, హైకమాండ్ చొరవ..
మంత్రి రామలింగారెడ్డి ఓకే?


