పలు ప్రాంతాల్లో జోరు వర్షాలు | - | Sakshi
Sakshi News home page

పలు ప్రాంతాల్లో జోరు వర్షాలు

Jun 7 2026 8:42 AM | Updated on Jun 7 2026 8:42 AM

బనశంకరి: రుతు పవనాల ప్రభావంతో బెంగళూరుతో పాటు చిక్కమగళూరు, హుబ్లీ– ధార్వాడ, బాగల్‌కోటె తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం బెంగళూరులో జోరువాన పడింది. మెజెస్టిక్‌, మల్లేశ్వరం, రాజాజీనగర, విజయనగర, వసంతనగర, ప్యాలెస్‌ గుట్టహళ్లి, కాటన్‌పేటే, కార్పొరేషన్‌, చిక్కపేటే, గాంధీనగరతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వానకు రోడ్లు జలమయం అయ్యాయి.

11 వరకూ

అలాగే శుక్రవారం నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడులోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 11వ తేదీ వరకు వానలు పడతాయి. బాగల్‌కోటెలో ఆకాశంలో మేఘాలు సుడులు తిరుగుతూ మేఘావృతం కావడం విశేషం.

బెంగళూరులోనూ వాన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement