ముసుగు దొంగల ముఠా సంచారం | - | Sakshi
Sakshi News home page

ముసుగు దొంగల ముఠా సంచారం

Jun 7 2026 8:42 AM | Updated on Jun 7 2026 8:42 AM

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలో ముసుగు దొంగల ముఠా సంచరించింది. నలుగురు వ్యక్తులు ముసుగులు, జీన్స్‌, జాకెట్లు, గ్లౌజులు, బూట్లు ధరించి శుక్రవారం రాత్రి బసవేశ్వర సర్కిల్‌ సమీపంలో సంచరించారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. వారి వయస్సు ముప్‌పై నుంచి నలభై ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా. వీరు పట్టణంలోని చోరనూర్‌ రోడ్డు సమీపంలో, మసీదు వెనుక ఉన్న ఇళ్ల దగ్గర రాత్రిపూట తిరిగారు. అయితే ఏ ఇంట్లోనూ దొంగతనం జరిగినట్లు సమాచారం లేదు. స్థానికులు అప్రమత్తం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ప్రాంతంలో నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో జరిగిన ఒక ఘటనలో, పట్టపగలు తాళం వేసి ఉన్న మూడు నాలుగు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, లక్షల రూపాయల విలువైన డబ్బు, విలువైన వస్తువులను దోచుకుని పారిపోయారు.

సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు

పోలీసుల నిఘా పెంచాలని కోరుతున్న స్థానికులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement